పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావడము చేత ఇటువంటివి మరికొన్ని లేచినవి. ప్రభుత్వము వారుకూడా ఇట్టిబకుడులను స్థాపించి విద్యావిధానములో చేర్చుకొన్నారు. 1918 స:రమున - *డెన్మార్కులో 6,640 విద్యార్థులతో ఈ బడు లుండేవి. వీటిలో చలికాలములో మగ వారికి అయిదు నెలలున్ను ఎండ కాలములో ఆడ పిల్లలకు నాలుగు నెలలున్ను చదువు చెప్పేవారు, వసతిబడులలో 18 ఏండ్ల నుంచి 20 ఏండ్లలోపు వి ద్యార్థులను చేర్చుకొంటారు. వీరిలో చాలామంది వ్యవసాయదారులు. వ్యవసాయానుభవ 'మెక్కు వగాగల సాధారణ విద్యను వీరికిస్తున్నారు. వీరిలో పనికివచ్చిన కొందరిని వ్యవసాయక ళాశాలలకు పం పుతారు. ప్రస్తుత స్థితిని బాగు చేసి, మంచిపౌరు లను తయారు చేయడమే ఈబడుల ఉద్దేశము.

వయస్సుమించినవారికి బడుల నేర్పాటు చేసే పద్ధతిని స్వీడను, నార్వేలవారుకూడా ఇప్పు డవలంబించినారు. వీటిని ప్రభుత్వమువారే పో షిస్తారు. ఇంగ్లాండులో ఈ ఉద్యమమును యూని వర్సిటీ ఎక్స్టెన్షస్ ఉపన్యాసాలుగా ఆరంభించినారు.

178