Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యులకు సంవత్సరమునకు 220 పౌనులనుంచి 420 పౌనులవరకున్ను ఇస్తారు. ప్రధానోపాధ్యాయులకు సంవత్సరమునకు మరి 60 సౌనులు ఎల నెన్సు ఇస్తారు. ఇన్స్పెక్టర్ల జీతము సంవత్సరమునకు 310 పౌనులనుంచి 500 పౌనులవరకు ఉంటుంది.అంద రుస్ను 20 ఏళ్ళలో పై మెట్టు జీతమునకు చేరేటట్లు ఏటేటజీతము హేచ్చు చేస్తారు. అరవై అయిదో యేట సాధారణముగా ఉప్యోగము చాలించుకొం టారు. నలభై యేళ్ళు పని చేసిన తరువాత జీతములో 5వంతులలో 4 వంతులు ఫించను ఇస్తారు. ఉద్యోగి చచ్చి తే, అతని భార్యకు ఫించను అయిదోవంతున్ను వారిపిల్లల పోషణకోసము పిల్లలకింత అని వారి 8 దేండ్లు వయస్సువరకు కొంతసొమ్మున్ను కూడా ఇస్తారు. ప్రఫెసరుకు సంవత్సరమునకు 500 పౌ నులనుంచి 800 పౌనుల వరకు జీతమిస్తారు. వీరు సాధారణముగా అరవై అయిదోయేట పనిచాలిం చుకొన్న , వారీ ప్రఫెసరు బిరుదముగాని, జీతము గాని పోదు. ఆతరువాత వారప్పుడప్పుడు విశ్వ విద్యాలయములో తమకిష్టముంటే ఉపన్యాసాలివ్వ

176