Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురుకంటె ఎక్కువమంది ఉండరు. వ్రాతపరీ క్షలో బాగుగా చేయని వారిని నోటితో కూడా పరీ క్షిస్తారు. భాషా పరీక్షలలో విద్యార్థులు నిఘం టువుల నుపయోగించుకోవచ్చును. పరీక్షలలో ఏవోకొన్ని ముఖ్య విషయాలలో నే కాని, అన్నిటి లోను పరీక్ష చేయరు. జిమ్నేసియముబడు లలో భాషమీదను, ఓబర్-రియల్ -షూలెలో భాషలు, గణితము', శాస్త్ర ముమీదను పరీక్ష చేస్తారు. విశ్వవిద్యాలయములో డాక్టరు పరీక్ష ఒక్కటే ఉంటుంది. దీనిలో తరగతులనీ ఒకతర గతిలోనుంచి మరిఒక తరగతిలోనికి వేయడమనిన్ని ఉండదు.ఇండియాలోని పరీక్షలు ఇంగ్లాండులోని పక్షులను అనుకరిస్తున్నవి. జర్మనుపరీక్షలను గు రించి తెలుసుకోవలెనంటే మన ఇప్పటి పరీక్షలన, గురించి మరచిపోవలెను. జర్మను పరీక్షలు ఇంచు మించుగా మన దేశములో ఇంగ్లీషువారు రాక పూర్వ ముండేపక్షులను పోలి ఉంటవి. డాక్టరు పరీక్షకు పోయేవారు ఒక అధ్యాపకుని చేతికింద పరి శోధన చేయవలెను, ఆ అధ్యాపకుడు విద్యార్థి


172