Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనిలో సహాయము చేస్తూ ఉంటాడు. పరీక్షకు అద్యాపకుడు ఒప్పుకొన్న ఒక విషయము మీద వ్యాసము వ్రాయవలెను. వ్యాసము సరిగా ఉన్న దని ఒప్పుకొన్న తరువాత, ఒకసాయంకాలము ఏ ర్పరచి నోటి పరీక్ష చేస్తారు. ఈపరీక్షకు విద్యార్ధి రెండు విషయాలను ఎంచుకొంటాడు. ఇవి తానుపరిశోధన చేసిన ముఖ్యవిషయమునకు సంబంధించి ఉడనక్కరలేదు. గణికములో పరీక్ష ఇ చ్చేవాడు నోటి పరీక్షకు సంస్కృతమున్న, భూగర్భశాస్త్రము న్ను ఎంచుకోవచ్చును. ముగ్గురు పరీక్షకులను ఏర్పాటు చేస్తారు. ఏ ద్యార్థి పరీక్షకు ముందుదినమున 10 గంటలకున్ను 1 గంటకున్ను మధ్య సాయంకాలపు దుస్తులు వేసుకొని ఆ ముగ్గురు పరీక్షుకులను చూడవ లెను. “నీ వేమీ ఉపన్యాసాలు విన్నావు? ఏమిఫుస్తకాలు చదివినావు?” అనివా రతనిని అడుగుతారు. నోటిపరీక్ష సాధారణముగా రెండు గంటలు జరుగుతుంది. ఆయాఫాకల్టీల అధ్యక్షులు విద్యార్థి తీసుకొన్న విషయమును గు రించి తెలియని ఒక నిని నియమిస్తాడు; అతడు పరీక్ష


173