పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హైస్కూలులోని తుదిషరీక్షకు అబిట్యూరీ యెంటెన్ పరీక్ష అని పేరు. ఇది ప్యాసయినవారు వీశ్వవిద్యాలయములో గాని, కార్మిక, వృత్తి కళా శాలలలో గాని చేరవచ్చును- ఆబిట్యూరియెంటెన్ పరీకు విద్యార్థి పండోమ్మిదో యేట జరుగుతుంది. మన ఇంటర్మీడి యేట పరీక్ష అంత కఠినముగా ఉంటుంది.ఈ పరీక్షకు ఆమండలఇ న్స్పెక్టరు. తనిఖీ కింద, ఆయా విషయాలను చెప్పిన ఉపాధ్యాయు లే చేస్తారు. పరీక్ష వ్రాతలోను నో టితోను కూడా ఒకొక్క పేసరులో ఒక్క ప్రశ్నే ఉంటుంది. ఆవిషయమై విద్యార్థి ఒక వ్యాసమును వ్రాయవ లెను. మన పరీక్షలలోవలె అనేక ప్రశ్న లకు ఉత్తరములు వ్రాయనక్కర లేదు. ఉపా ధ్యాయుడు మూడు ప్రశ్నలు వ్రాసియిస్తే ఇన్స్పె క్టరు వాటిలోనుంచి ఒక్క ప్రశ్నను ఎంచు తాడు, సాధారణముగా పరీక్షకు మూడు నెలలకు పూర్వము ఒక పరీక్ష చేసి, తుదిపరీక్షలో నెగ్గగలరనితోచినవా ళ్ళనే అబిట్యూయరియెం టెస్ పరీక్షకు పోనిస్తాడు. ఈ విధముగా వెనుక నుండిపోయేవారు. నూటికి 15


171