పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరీక్షలు చేసి పై తరగతులలో వేసే ప్పద్దతి ఆదేశములో లేదు. సంవత్సరమునకు మూడు టెర్ములు, టెర్ము ఆఖరున ఉపాధ్యాయుడు : ద్యార్థిని గురిం చిన తన అభిప్రాయమును ఒక (రిజిష్టరులో వ్రా స్తాడు. ఈ అభిప్రాయాలు మాటలలో ఉండవు. ఎ, బి, సి, అనిగాని, 1, 2, 3, అనిగానీ ఉంటవి. చాలాబడులలో ఇంగ్లాండులోవలె ఎ+, ఎ-బి + బి-- సీ+, సి-, మొదలయిన ఏ భాగమున్ను ఉంటుంది. సంవత్సరాంతమున ప్రధానోపాధ్యా యుడు ఉపాధ్యాయుల సలహాల మీదను, టెర్ము రిమార్కుల సహాయముతోను, పిల్లలను పై తర గతులలో వేస్తాడు. నూటికి పదిమంది కంటే ఎ క్కువమందిని వెనుకకు ఉంచి వేయడు. చదువు బాగుగ లేదని పిల్లలకున్న వారితండ్రుల కున్ను చా లాముందుగానే తెలియ జేస్తారు. కానీ, పరీక్షలలో ప్యాసయి తేనేతప్ప ప్యాసు చేయకపోడు. ప్రతి బడిలోను, ఆటలు, వ్యాయామక్రీడలు, కసరత్తు, విధేయత, మంచినడవడి, తెలివి తేటలకు కూడా మార్కులిస్తారు.

170