పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/170

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలెనని కోరినారు. 1921 సం|కములో స్త్రీలకు వోటు ఇచ్చే అధికారము వచ్చినది. ఇది గాక మగవాళ్ళు యుద్దమునకు పోయి ఉన్నప్పుడు ఆడ వాళ్ళకు వారిఉద్యోగము లిచ్చినారు. యుద్ధము కాగానే స్త్రీలు తమ ఉద్యోగములను మగవాళ్ళకు ఒప్ప జెప్పడాని కంగీకరించ లేదు. మగ వాళ్ళతో సమానముగా మాకున్ను విద్యా సౌకర్యములుండ వలెనని కోరినారు. 1921 వ సం: రములో విద్యాంగ మంత్రి ఒక కాన్ఫరెన్సు చేసినాడు, దానిలో విద్యా విషయములో స్త్రీలకుండే నిర్బంధములన్నీపోయినవి. ఇప్పుడు మంత్రి చేతికింద, అతనికి శ్రీ విద్యా విషయమై సలహాధవ్వడానికి ఒక ఉద్యోగిని ఉన్నది.

ఇప్పుడు జర్మనుల పిల్లలు మొదట మగ పిల్లలతో బాటు నాలు గేళ్ళు "గ్రుండ్ షూలె" (సామాన్య విద్యాలయము)నకు పోతారు. పదేం ళ్ళు వయస్సున బాలురతో బాటు కొందరు ఉన్నత పాఠశాలలలోను, కొందరు మాధ్యమిక పాఠశా లలలోను చేరుతారు. మిగిలినవారు ప్రారంభ


183