పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుచి విషయములలో ఒకరితో ఒకరు పోటీ మీద పని చేసుకొనేవారు,వీరికి చిట్టా ఆవర్జాలు వ్రాయడము, ప్రధమచికిత్స, రోగులను పోషించడము కూడా నేర్చేవారు.

ఆడవాళ్ళు ఇళ్ళలో ఉండి, పిల్లలను చూచు కొంటూ ఉంటార నే ఉద్దేశముతో వారి విద్యాక్ర మమును ముందర ఏర్పాటు చేసినారు కాని, వారీ నిర్బంధములను సహించక ఆందోళనము చేయనా రంభించినారు. దాని మూలముగా 1908 సం: రములో వారికి “లిజియమ్” (Iyucum) అనే ప్రత్యేక హై స్కూళ్ళను ఆరేళ్ళు చదువు కొన డానికి ఏర్పాటు చేసినారు. “ఓబర్ - రియల్ షూలె”లోని కడపటి మూడు తరగతులలోను చ దువుకొని వారు ఆబిట్యూరియెంట్ - పరీక్షకు పోవడానికి కూడా వీలుకల్పించినారు. ఈఏర్పాటు తృప్తికరముగా లేకపోవడము చేత హైస్కూళ్ళ కంటే పైవిద్యాలయాలను (ఓబర్' లిజియమ్) (Ober - I_yzeum) 1917 సం|రములో యుద్ద సమయములో ఏర్పాటు చేసినారు.

162