Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాఠశాలలలోనే మరి నాలు గేళ్ళు ఉంటారు. వృత్తి పాఠశాలలలోనికిన్ని పారిశ్రామిక పాఠశాలలలో నికిన్ని బాలురవలెనే బాలికలున్న నిర్బంధముగా పోవలెను. ఆడపిల్లలకు (1) కూలిపనివాళ్ళకుద్దేశించిన “ఔఫ్-బౌ-షూలె”నూతనోన్నత పాఠశాలలు (2) లిజియములు అని రెండు విదముల ఉన్నతపాఠశాలలున్నవి.లిజీయములో ఆ రేళ్ళు చదువుకొని ఆడపిల్లలు (1) ఒకవసతిపాఠశాలలో చేరి గృహనిర్వాహకత్వము నేర్చుకో వచ్చును లేదా (2) మగపిల్లల జిమ్నే సీయములో చేరవచ్చును, లేదా (3) లిజియమునకనుబంధ ముగా గాని ప్రత్యేకముగాగాని ఉండే ఓబర్ లిజి యములో చేరవచ్చును.ఓబర్ - లిజియములో మూడేళ్ళు చదువుకోవలెను. దీనిని తుదిపరీక్ష ఆబిట్యూరియెంటెన్ పరీక్షతో సమానము, రెండుపరీక్షలున్ను ఒక్క రీతిగా నే జరుగుతవి. ఈపరీక్ష ప్యాసయిన వారు బాలురవలెనే బాలికలున్ను ఒక విశ్వవిద్యాలయములోగాని, కార్మికకళా శాలలో కాని చేరవచ్చును,



164