పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరీక్ష బ్రిటిషు విశ్వ ద్యాలయాలలోని వాణిజ్య (బి. ఎస్. సి.) పరీక్షకున్ను, డాక్టరు బిరుదము (పిఎచ్ , డి.) బిరుదమునకున్ను సరిపోతవి. మా చదువు మూడేళ్ళు. డిప్లొమా పుచ్చుకొన్న తరువాత ఏవిశ్వవిద్యాలయములో నై నా మరి రెం డేళ్ళు చదివి డాక్టరు బిరుదము పొందవచ్చును. విశ్వవిద్యాలయాలలో వాణిజ్యములో ఎక్కువగా పేరుపొందినవారు ఉన్యాసాలిస్తారు. ఇచ్చటి విద్య కేవల పుస్తక స్థవిద్య కాదు.

ఈ వాణిజ్య పాఠశాలలు, కళాశాలలోనే కాక , పగటి పూట వృత్తిని చూచుకొనే పెద్దవారికి సాయంకాలము ప్రత్యేకముగా బోధించే పాఠ శాలలు కూడా ఉన్నది. వాణిజ్యవృత్తి నవలంబిం చే వారి విద్య సాధారణ విద్య, అనుభవ వాణిజ్యము, వాణిజ్య విద్య - అని మూడు భాగాలుగా ఉంటుంది. కొన్ని బడులలో వాణిజ్య విద్య చెప్పి, తరువాత అను భవమిస్తారు. కోటీశ్వరులు కూడా తమపిల్లలకు చిన్న క్లాసులలో నుంచి, పెద్ద క్లాసులవరకు, వేగము వేగముగా వాణిజ్య విద్య చెప్పిస్తారు. మంచి వాణి

159