పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జ్య విద్య సంపాదించిన వాడు. జీవితములో బాగుగా విజయు డౌతాడు.

అధ్యాయము 17

శ్రీవిద్య.

మొదటి నుంచిన్ని బాలురతో పాటు బాలి కలనున్న ప్రారంభ, మాధ్యమిక పాఠశాలలలో చేర్చుకొంటూనే ఉన్నారు. ఇద్దరికిన్ని పొఠక్రను మొక్కటే; కాని, చేతి పనులలో భేదముండేది. ఆ పిల్లలకు కుట్టు పసి, వంట, దాదిపని, వీటితో కూడిన గృహ నిర్వాహకత్వము నేర్పుతూ ఉండేవారు. ఉత్తమపాఠశాలలలో మాత్రము బాలబాలికలకు భేదముకల్పించినారు. బాలుర కు ద్దేశించిన ఉన్నత పొఠశాలలలోనికి, జిమ్నే సియములలోనికిని బాలిక లను చేర్చుకొనేవారు కారు. అందుచేత వారు ఆబి బ్యూరియెంటెన్ పరీక్ష ప్యాసయి కళాశాలలలో చేరడానికి వీలుండేది కాదు. కాని, ఉపాధ్యాయినీ వృత్తి నవలంబిం పదల చిన ఆడపిల్లలు కళాశాలలలో

160