పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చును. దీనికి తక్కినవిషయములలోవలెనే పరీక్ష జరుగుతుంది

ఒక ఫాక్టరీలో గాని, పారిశ్రామిక కంపెనీలో గాని ఏడేళ్ళయినా పని నేర్చుకొంటెనే తప్ప, ఎవరినీ ఈ“హాక్ షులే”లో అధ్యాపకుడుగా నియమించరు. ఈ అధ్యాపకులకున్ను ఆయా పరిశ్రమాధి కారులకున్ను మంచిపరిచయముంటుంది. ఆందు చేత విద్యార్థులకు ఆయా ఫాక్టోరీలలోనికి సులభముగా ప్రవేశమ దొరుకుతుంది.

అధ్యాయము 16

వాణిజ్య విద్య.

జర్మనీలో మొదట వాణిజ్య పాఠశాలను హాంబర్గు పట్టణములో 1771 సం.రములో స్థాపించినారు. తరువాత మరి 20 ఏళ్ళకు బర్లినుపట్టణములో వాణిజ్య సంఘమువారు మరిఒకటి స్థాపించినారు.యుద్ధసమయములోను, ఆతరువాతను, సాధా రణపాఠశాలలవలె వాణిజ్య పాఠశాలలను కూడా


153