పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రారంభ, ఉన్నత, పాఠశాలలు గాను, విశ్వవిద్యా లయాలుగాను ఏర్పాటు చేసినారు. ఆయావృత్తులలో ఉండి, వివిధ తరగతులలో విద్యను సంపాదించినవారు వీటిలోవేశించ వచ్చును.

వాణిజ్య విద్యాలయము లను (1) ప్రారంభ వాణిజ్య పాఠశాశాలలు (3) ఉన్నత వాణిజ్య పాఠ శాలలు (8) వాణిజ్య కళాశాలలు -అనిమూడు భాగములుగా విభజింపవచ్చును. వీటి పరిపాలనమున్ను , వీటిలోనికి ప్రవేశమున్న కార్మిక వృత్తి. విద్యాలయములలో వలెనే ఉంటుంది.

ప్రారంబ వాణిజ్యపాఠశాలలు

వీటికి "కౌఫ్ మాని షేన్ బెరుఫ్ షూలె.. " అనగా దుకాణదారుల పాఠశాలలని పేరు. చిన్నపట్టణములలో ఈబడులలో చేరడానికి చాలినంత మంది పిల్లలు లేకపోతే సాధారణ వృత్తి పాఠశాల లలో ఈతరగతులుకూడా చేర్చు తారు. అప్పుడా పొఠశాలలను "కౌఫ్ మానీ షెస్' ఫాక్ క్లాసెస్"అంటారు. ఈ రెండు విధములైన పాఠశాలలలోను పాఠక్రమ మొక్కటే. నిర్బంధ ప్రారంభ విద్యను


154