పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రపాలక సంఘములవారు చాలా సొమ్ము ఖర్చు పె ట్టుకున్నారు. 1928 సం||రములో ఒక్క బెర్లిను పురపాలక సంఘమువారే ఈ విషయమే 600,000 పౌనులు ఖర్చు పెట్టినారు.

జర్మనీలో ఈసంరంభమునకు ఇంకా ఒక ఆకారము ఏర్పడ లేదు. దేశ నాయకులు దీని మూలముగా జూతీయశీలము నభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అధ్యాయము 17.

కార్మిక విద్య, పారిశ్రామిక విద్య.

ప్రతి ఫాక్టరీలోను, పెద్ద కార్యానాలలోను మూడుర కాల పనివాండ్లు కావలసి ఉంటారు.

(1) ఫాక్టోరీ అంతటిని మొత్తము మీద నడిపించేవారు. వీరు యంత్రము లేరీతిగా ఉండ వలెనో ఆలోచించి ప్లానులు వేస్తారు. వీరిపని ఉన్న యంత్రములను ఎట్లునడిపించడము అనేది కాదు. ఆయాయంత్రములను ఎట్లు అభివృద్ధి చేయ

136