పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డము అని వారాలోచిస్తూ ఉంటారు. వీరికి కార్ఖానాలో అనుభవము తక్కునగా ఉంటుంది. వీరి పని కాగితాలమీద ప్లానులు వేసుకొని ఆలోచించుతూ ఉండడమే వీరిని “ఇంజనీర్లు” అనపచ్చును.

(2) ఫాక్టరీలో ఆయాభాగాలను సరి చూచుకొనేవారు వీరికి యంత్రములను సడి పించడము, వాటిని సరిచేయడము, వాటిని మర మ్మత్తులు చేయడము, బాగుగా తెలిసి ఉండవలెను. వీరికి " మే స్త్రీలు” “ఓవర్ సీయర్లు” లేక “ఫోర్మెన్" అనవచ్చును.

(3) ఏదో ఒక యంత్రము యొక్క - చిన్న భాగమును కనిపెట్టుకొని ఉండి, అక్కడిపనినే చేస్తూ ఉండేవారు. వీరు మేధావంతులుగా ఉండరు. తమపనిని చేసుకొనిపోతూ ఉంటారు. వీరిని కార్మికు లనవచ్చును.

పై మూడు విధములవారున్ను చేసేపనులును వేర్వేరుగా ఉంటవి. అందుచేత వారివారికి ప్రత్యేక శిక్షణము నివ్వవలసి ఉంటుంది. ఒక

137