పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జన మునక య్యే ఖర్చులను సంఘమువారు హోటే ళ్ళకు ఇస్తారు. అందు చేత హోటేళ్ళమీద సాధారణముగా నష్టము రాదు. సంఘమువారు సహ కార విక్రయశాలలను ఏర్పాటు చేసి నారు. ఇందులో వస్తువులు కొనడము వల్ల , పైని కొను క్కొనడముకంటె నాలు గో వంతు మిగులుతుంది. బట్టలు, జోళ్ళు, మొదలయిస విలువగల వస్తువు లను కంపెనీలనుంచి అందరూ కలిసి తెప్పించు కొంటారు, కంపెనీల వారు మంచి డిస్కౌంటు ఇస్తారు. పాత విద్యార్థులు తమ పాఠపుస్తకా లను ఈ గృహములకు ఉచితముగా ఇస్తారు. వీటిని పేద విద్యార్థులు ఉపయోగించుకొంటారు, చాలామంది విద్యార్థులు ఉపన్యాస సారాంశములను టైపు చేసుకొంటారు. టైపు చేసుకొనడానికి సంసుమువారు టైపు మెషీనులను ఉచితముగా ఎరువిస్తారు. ఈ మెషీనులను విద్యార్థులు తమ గదులకు కూడా తీసుకొని పోవచ్చును. ఇదిగాక రోగముపడ్డ విద్యార్థులను జర్మనీలోను ఇతర దేశ ములలోను ఉన్న రోగులను పోషించే గృహముల

123