పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్నారు. ఈ యిళ్ళు కట్టడానికి చందాలు లే వనెత్తినారు. చందాసొమ్ము కాక అసొమ్ములో నూటికి 70 వంతు ప్రభుత్వమువారు కూడా ఇచ్చినారు. ఈ ఇళ్ళు విశ్వవిద్యాలయసంఘముల వలే సంఘము ఉంటవిగాని, హాస్టలు లవలె ఉండవు. ఈ యిళ్ళకు అను బంధించి పెద్ద హొటేళ్ళుంటవి. వీటిలో చౌకగా అన్నము పెట్టుతారు. మరిఒక చోట కంటే ఈహొటేళ్ళలో నూటికి 60 వంతు మా త్రమిచ్చుకోవలసి ఉటుంది. మొత్తము వి ద్యార్థులలో మూడోవంతుమంది బసలు చేసుకొంటారు. ఈ ఇళ్ళలో ఉండడము వల్లను, వీటి కనుబంధించిన భోజనము చేయడము వల్లను, సంవత్సరానికి ఈ ధ్యార్థులందరూ కలిసి 88,000 పౌనులు మిగుల్చుకొంటారు. ఈ మిగిలిన సొమ్ము పేదవిద్యార్ధు లకు సహాయనిధిగా ఏర్పడుతుంది. చాలమంది బీద విద్యార్థుల నుంచి సగము సొమ్ము మాత్రమే తీసుకొంటారు. నూటికి 15 గురు పేద విద్యార్ధు లను ఉచితముగానే చేర్చుకొంటారు. ఉచిత భో

122