పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లయాలకు మూలధనము లేక పోవడము చేతను అవి కూడా ప్రభుత్వము మీదనే ఆధార పడి ఉం డడము చేతను, విద్యార్థుల కెట్టి సహాయమును చేయజాలక పోయినవి. అందుచేత విద్యార్థులు స్వయంసహాయము చేసుకోవలసి వచ్చినది. 1921 సం. రము ఫిబ్రవరి నెలలో పెద్ద సభ చేసి స్వయం-సహాయ సంఘము నొక దాని నేర్పాటుచేసుకొన్నారు. ఈ సుఘమునకు మూలస్థానము డ్రెన్-డ్రెన్ (Lort: 1en) పట్టణములోను, దానిశాఖలు ప్రతి విశ్వవిద్యాలయ స్థానములోను ఏర్పాటు చేసినారు. 1921 సం. రలో వారేర్పరుచుకొన్న చిన్న సంఘము, ఇప్పుడెంతో అభివృద్ధి అయి, జర్మనీ దేశము లోని ఉన్నత విశ్వవిద్యాలయ విద్యావ్యాపనము విషయమై ఎంతో పని చేస్తున్నది.

ఈ సంఘమువారు విశ్వవిద్యాలయ స్థలా లన్నిటిలో విద్యర్థిగృహములను కట్టడానికి ప్రయ త్నిస్తున్నారు. అప్పుడే ఇటువంటివి అయిదు కట్టి నారు. ఇతర స్థలాలలో అద్దెలకు ఇళ్ళు పుచ్చు

121