Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆను ఒక సివిలియను ఉద్యోగిని నియమిస్తాడు. ఈ ఉద్యోగి యూనివర్ సిటి పట్టణములో కాపరముండి తన కాలమంతా యూనివర్ సిటీ పని మీదనే ఉపయోగించ వలెను. యూనివర్ సిటీ వారికిన్నీ మంత్రుకిన్నీ జరిగే ఉత్తర ప్రత్యుత్తరములు ఇతని ద్వారా జరుగవలెను. ఒక రాష్ట్రములో ఉండే ఉన్నత పాఠశాలలను స్కూలె కొల్లెగియం (Schule koilegeum) అనే ఇన్ స్పెక్టర్ల సంఘము వారు నిర్వహిస్తారు. ఈ సంఘములో ఆయా రాష్ట్రముల విస్తీర్ణమును బట్టి, ముగ్గురి నుండి ఏడుగురు వరకు ఇన్ స్పెక్టర్లుండ వచ్చును. వీరు ప్రతి ఉన్నత పాఠశాలలు ఏడాదికొక సారి అయినా తనిఖీ చేసి అబుట్యురి ఎంటెన్ (Abiturientebn) అనే తుది పరీక్షను చేయవలెను. వీరు ఉపాధ్యాయుల పరీక్షలను కూడా చేస్తారు. ఉన్నత పాఠశాలల యుపాధ్యాయులకు జర్మినీలో ప్రత్యేకముగా ట్రైనింగు స్కూళ్లు లేవు. సాధారణ పాఠశాలల లోనే ఉపాధ్యాలులకు ట్రైయినింగు ఇస్తారు.

ప్రాథమిక పాఠశాలలమీద ప్రత్యేకముగా

6