ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఒక ఇన్ స్పెక్టరుంటాడు. ఇతను ప్రారంభ విద్యా డైరెక్టరుకె తిన్నగా రిపోర్టు పంపుకొంటాడు. ఉన్నత పాఠశాలల ఇన్ స్పెక్టరుకు ఇతను లోబడి ఉండ నక్కర లేదు. ప్రాథమిక విద్యను గమెండె స్టాడ్ట (తాలూకా బోర్డు, పురపాలక సంఘము) ల వారే చూచుకుంటారు. ప్రభుత్వము వారు ఆ బడులకయ్యే ఖర్చును వీరికిస్తారు. ఆయా గెమెండె స్టాడ్ టులవారి అధీనములో ఉన్న బడుల లోని ఉపాద్యాయుల, విద్యార్థుల మొత్తమును బట్టి గ్రాంటుల మొత్తమున్ను ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలు స్థానిక ప్రభుత్వముల వారి అధీనములో ఉన్నా, వాటిని ప్రభుత్యోద్యోగులే తనిఖీ చేస్తారు.
ప్రాన్ సులో వలె ఒక్కొక మంత్రి క్రింద అనేక డిపార్టుమెంటులుంటవి. ఒక్కొక్క డిపార్టుమెంటు ఒక్కొక్క డైరెక్టరు క్రింద ఉంటుంది. మంత్రికి వచ్చే ఉత్తరములన్నీ ఆయా డిపార్టుమెంటుల డైరెక్టరు చూస్తారు. ఈ డైరెక్టర్లు మంత్రులక్రింద శాశ్వతోద్యోగులై వుంటారు. వీరికి