పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యము కలుగ జేసుకొంటారు. ఇద్దరున్ను గ్లాసు లను “బీరు”తోనింపి “ఒకటి, రెండు, మూడు అని ఒక్క గుటకలో తాగి వేస్తారు. ఇట్లు ఆట్లు త్రా గుతే వారి సౌహార్దము వెల్లడి అవుతుందట. కొక్కప్పుడు వారిద్దరికి పరిచయము కలుగజేసే మూడోవాడు మధ్యను నిలబడి “ఒకటి, రెండు మూడు, పాసిట్' (ఆరోగ్యము)” అంటాడు. అప్పుడు వారిద్దరున్ను గ్లాసులను టేబిలుమీద చప్పు డు చేసి “ఒకటి. రెండు, మూడు, పా సీట్ (ఆరో గ్యము)" అని తాగి వేస్తారు. ఎవరు ముందర తాగి వేస్తే వారు గెలిచినట్టు. 'పేదరికము చేత చాలమంది విద్యార్థులు ఎక్కువగా తాగడము అలవాటు చేసుకోరు. ఈ సంఘములవారు టె ర్ములో ఆధ్యాపకులు చేసిన ఉపన్యాసాల సారాంశ మును వ్రాసిన రిపోర్టు ఒకటి ప్రకటిస్తారు. దీని ప్రతులను ప్రాత విద్యార్థుల కందరికిన్ని పంపుతారు. ఈ ప్రాత విద్యార్థులకు "అల్టెహెర్” ( Alte Herr) (ముసలి పెద్దమనుష్యులు) అని పేరు. వీరిని ఆయా సంఘాల ముఖ్యసభ లకున్ను వింది.

111