పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురించిన జ్ఞానమును అభివృద్ధి చేయడానిక ఏర్పడిన సంఘము. ఆంఘము సాధారణముగా వారమ న కొక నాడు కలస్తుంది. ఒక ఆవిషయమును బోధించే ఉపాధ్యాయులందరున్ను ఈసభలకు వస్తారు. విద్యార్థులలో ఎక్కువ అనుభవము గలవానిని కూడా ఈసభలకు ఆహ్వానిస్తారు. 'మొ దటి అరగంట, గడచిన వారములో ఆ విషయము సుగురించి బయలు దేరిన పుస్తకాలు, వ్యాసాలు, మొదలయిన వాటిని గురించి చర్చ జరుగుతుంది. ఒక కొత్త పుస్తకముగాని, ముఖ్య మైన వ్యాసముగాని ఉంటే, దానిని చదివి, దానిమీద తన అభిప్రాయమును మరుచటి సభలో తెలియ చేయవలసినదని, ఒక ఉపాధ్యాయుని గానీ, అనుభవ ముగల విద్యార్థిని కాని అడుగుతారు. ఇందువల్ల జర్మనీ లోను , ఇతర దేశాలలోను, ఒక విషయమై జరుగు ఉన్న అభివృద్ధి అంతా ఇక్కడివారికి తెలుస్తూ ఉంటుంది. రెండో అరగంటను వ్యాసములను చదివి, వాటిమీద చర్చ చేయడానికి వినియోగిసారు. సెమినారులో చదివే వ్యాసాల


104