పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంటె, ఈ వ్యాసాలు ఎక్కువ ముఖ్యమయినవిగా ఉంటవి. ఈ మీటింగయిన తరువాత సభ్యులందరూ ఒక అల్పాహారగృహములో కలుస్తారు.

పాఠక్రమము

ఈ గంటలలో ఈ ఉపన్యాసాలు జరుగ తవి అని ఎవరున్ను టైము టేబిలు ఏర్పాటు చేయరు. రాబోయే "టెర్ము"లో ఏ షషయమును గురించి ఉపన్యాసా లివ్వదలచిన దిన్ని ప్రతి ఉపాధ్యాయు డున్ను తెలుపు తాడు. ఒక శాఖలోని పెద్ద అధ్యాపకుడు ఒక ఉపాధ్యాయుని చేత ఎప్పు డేఉపన్యాసము జరిగేదీన్ని ఏర్పాటు చేయిస్తారు. ఒక ఉపన్యాసము జరిగే గంటలో మరి ఒక ఉపన్యాసము కూడా జరుగకుండా మాత్రము ఆ ఉపాధ్యాయుడు చూడపలెను.

వసతి

విద్యార్థుల వసతులమీద : విశ్వవిద్యాలయ మువారికి ఎట్టి అధి కారమున్ను లేదు. విద్యార్థులకు ప్రత్యేక వసతిగృహములు (Host:is) లేవు. వారు తమ ఇష్టము వచ్చిన ఇంటిలో ఉండవచ్చును.

105