పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నకు ఒక సారి అయినా ఇంటువంటి క్లాసు పెట్టుతాడు.

సెమినారులో పబ్లికు క్లాసులు జరుగుతవి. వీటిలో ఒక రిద్దరు విద్యార్ధులు ముందుగా తెలియ జేసిన విషయాల మీద వ్యాసాలు వ్రాసి చదవడమో, కొన్ని నిశ్చిత విషయాలను గురించి ఉపన్యాసాలు చేయడమో జరుగుతుంది. వ్యాసము చదవడముగానీ, ఉపన్యాసము చేయడ ముగాని అయిన తరువాత అందరూ కలిసి ఆ విష యమును గురించి చర్చిస్తారు. ఈ చర్చలో ఆ ధ్యాపకులు సహాయ పడుతూ ఉంటాడు, "సెమినారలో ఇద్దరు ముగ్గురు అధ్యాపకులు కూడా కలిసి సహాయము చేయడమున్ను కలదు. సెమీనారు ఉపన్యాసాలకు పూర్వము ఆవిషయమును గురించిన చరిత్రమును, దాని మీద ఉండే పుస్త కములను ఆలోచిస్తారు. ఒక టెర్ము చదువు, ముందుగా నిర్నీతమయిన విషయమును గురించే అయి ఉంటుంది,

"గె సెల్ షాఫ్ట్” అనేది ఒక విషయమును

103