పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చవచ్చును.

జర్మనీలో ఉపన్యాసము ఎప్పుడారంభమవు తుందో తెలియజేసిన వేళకు 15 నిమిషముల తరువాత అధ్యాపకుడు ఉపన్యాసము నారంభిస్తాడు, ఈ గడువుకు “ఎకెడెమిష్, ఫీర్టెల్ " (Acade- nische , Viextel) అని పేరు. కొన్ని సమయము లలో ఈ గడవు ఉండదు. గడువు ఉన్నదీ లేనిదీ స్పష్టముగా తెలియ జేస్తారు.

చదువు (1) కలో క్వియమ్ (Colloquiun) (2) సెమినార్ (Seminar) (3) గెసెల్ షాఫ్ట్ (Gesselechaft) అనే మూడుస్థలాలలో జరుగు తుంది. కలో క్వియములో విశేషజ్ఞానము నిచ్చే ప్రయివేటు ట్యూషను ఇస్తారు. ఒక విషయమును ముందుగా నిశ్చయించుకొని, అనేక విద్యార్ధు లిక్కడ ఆధ్యాపకుని కలుసుకొంటారు. ఇవి పబ్లికు క్లాసులు కావు.వీటికి పోవడానికి జీతము చెల్లించ నక్కర లేదు. ఆయా అధ్యాపకుని అనుమతి తీసుకొని ఏవిద్యార్థి అయినా ఈ క్లాసులకు పోవచ్చును. ప్రతి ఉపాధ్యాయుడున్ను వారము


102