Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ను విశ్వవిద్యాలయాలలో విద్యార్థులను 'మొదటి సంవత్సరము క్లాసు, రెండో క్లాసు, అని ఈ మోస్తరుగా వేర్వేరుగా విడదీయరు. చదువంతా అయిన తరువాత అంతమందు జరిగే ఒక్క పరీక్ష తప్ప మరేవీ పరీక్షలు జరగవు. ఈవిద్యార్థులు ఈ “ట్యూటరు” కింద ఉండవ లెననే పద్ధతి లేదు, ఉపన్యాసాలపట్టికను ప్రకటిస్తారు. వాటిలో విద్యార్థికి ఏ ఉపన్యాసాలు ఇష్టమయితే వాటికి పోయి వినవచ్చును. ఏ ఉపన్యాసాలు వింటే మంచిదో సలహా ఇవ్వడానికి ప్రత్యేకముగా ఉద్యోగస్థుడెవ్వడున్ను ఉండను. ప్రతి విద్యార్థి వద్దను ఒక ఉపన్యాసాలు వాసుకొనే పుస్తక ముంటుంది. దీనిలో విద్యార్థి ఏ ఉపన్యాసాలను ఎంచుకొని,జీతము చెల్లించినాడో, ఆఫీసు గుమా స్తా వ్రాస్తాడు. "టెర్ము” ఆరంభముస, ఆఖరున, ఇందులో ఆధ్యాపకుడు సంతకము చేయవలెను. అతడు సంతకము చేయడానికి విద్యార్థి ఏ ఉపన్యా సమును విసవలెననే నియమము లేదు, ఒక్కఉపన్యాసము నైనా వినకుండానే పట్టాను సంపాదిం


101