పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యతో సంబంధము లేదు. ఆయా పరగణాలు తమ తమ విద్యా సంస్థలను తామే ఏర్పాటు చేసుకొని, తామే పరిపాలించి కోవలెను. ఇరవై యారు పరగణాలలోను ఒక్కొక పరగణాకు ఒక్కొక విద్యాంగ మంత్రి ఉంటాడు. అతను ఆ పరగణా శాసన సభకు బాధ్యత గలిగి ఉంటాదు. ఆయా శాసన సభలు మూల ప్రభుత్వము వారు ఏర్పాటుచేసిన సామాన్య సూత్రములకు లోబడి తమతమ చట్టములను ఏర్పాటు చేసుకోవచ్చును. ఉపాధ్యాయులను నియమించడములో గాని, విద్యా విధానములో గాని, విద్యార్తులను బడులలో చేర్చు కొనే విషయములో గాని, మూల ప్రభుత్వము వారు జోక్యము కలుగ జేసుకోరు.

జర్మినీ దేశములో యూనివర్ సిటి విద్ద్యార్థులు ఏదో ఒక యూనివర్సిటిలోనే ఉండిపోరు. తమ అనుభవమును వృద్ధి చేసుకొనటకు ఒక యూనివర్ సిటీనుంచి మరియొక యూనివర్ సిటికి పోతూ వుంటారు. ఆఖరు పరీక్షకు మాత్రము ఏదో ఒక యూనివర్ సిటిలో స్థిరపడతారు. అందు


4