పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పన్నులను మూల ప్రభుత్వము వారున్నూ, కొన్నిటిని రాష్ట్రీయ ప్రభుత్వముల వారున్నూ వసూలు చేస్తారు. జర్మినీలో అలాగు కాదు. మూల ప్రభుత్వమువారే పన్నులనన్నిటిని వసూలు చేసి చట్ట ప్రకారము ఈ పరగణాకు ఇంత అని ఆయా ప్రభుత్వముల ఖర్చులకు పంచి పెట్టుతారు. పుర పాలక సంఘముల వారు మాత్రము నాటకములు, సినిమాలు, మొదలైన వినోదముల మీదనున్నూ, పురములకు కావలసిన పరత్యేక సౌకర్మములను కోసమున్నూ, పన్నులను విధించుకోవచ్చు.

పెద్ద పరగణాలు రాష్ట్రములు గాను, ఒక్కొక్క జిల్లా (1)(ఘెమైందె) (2)స్టాడ్ట్ (Stadt) అనే భాగములు గాను, విభజింప బడి ఉంటవి. ఇవి ఇంగ్లాండులోని కౌంటీలు, బరోల కున్నూ, ఇండియాలోని తాలూకాలు, పట్టణముల కున్నూ సరిపోతవి. బెర్లిన్ వంటి పెద్దపట్టణములకు రాష్ట్రముల హోదా ఉంటుంది.

జర్మినీ దేశములో మూల ప్రభుత్వమునకు