పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేస్తారు. వారానికి నాలుగు గంటల ఉపన్యాసాల చొప్పున ఒక నెల్లాళ్ళ ఉపన్యాసాలకు విద్యార్థి చెల్లించవలసిన జీతము ఒక షిల్లింగు ఆరు పెన్సులు. శాస్త్ర విద్యార్థులు తమఉపకరణములను రసా యనవస్తువులను తామే తెచ్చుకొంటారు. అధ్యాపకుని జీవితాంతమువరకున్ను నియమించినా అతడు సాధారణముగా 65 ఏడు వయస్సున తనపనిని చాలించుకొంటాడు. అంతట అతనికి ' ఫేకల్టీతో సంబంధముండదు. అయినా అతనికి “అధ్యాపకుడు" (Professon) అనే బిరుదము పోదు. అతని జీవితాంశము వరకున్ను అతని నిండు జీతము నతని కిచ్చి వేస్తారు. పని చాలించుకొన్న తరువాత పోశ అకకు ఉపన్యాసా లివ్వవ లెనని ఉంటే ఇవ్వ వచ్చునుగాని, ఇవ్వవ లెననే పూచీ లేదు. కానీ సాధారణముగా, రిటైరయిన ప్రఫెసర్లు తమ పరి శోధనములను సాగించుకొంటూ, యూని వెర్సిటీ లో తరగతులకు ఉపన్యాసాలిస్తూ, బహిరంగ ఉపన్యాసాలు చేస్తూనే ఉంటారు. జర్మనీలో ప్రొఫెసరు అనేమాట ఒక విశ్వవిద్యాలయ బిరుద


97