పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మింపవచ్చును. అట్టి ఖాళీ లేకపోయినా, ఆవిషయమును చెప్పే అధ్యాపకు డంత సమర్థుడు కాక పోయినా, సమర్థుడైన ఒకప్రయి వేటు ఉపాధ్యా యుని, అధ్యాపకుని జీతమంత జీతము మీద కాకుండా అసాధారణ అధ్యాపకుడుగా నియమిం చవచ్చును. ప్రతి అధ్యాపకుడున్ను తన విద్యా రులో ఒకనిని తనకు సహాయకుడుగా ఎంచుకొంటాడు. ఇతను తన అధ్యాపకుడు చేసిన ఉపస్యాసాలను వివరించి వ్రాస్తాడు. శాస్త్ర విషయాలను ఇతడు ఆయాపరిశోధనలను విద్యార్థుల యెదుట చేసికూడా చూపెట్టుతాడు. అధ్యాపకులకు సంవత్స రానికి 500 పౌనులు నుంచి 800 పౌనులవరకు జీతముంటుంది, ఈజీతము కాక, ఇతడు ప్రతి విద్యా నుంచిన్ని సంవత్సరానికి 50 పౌనుల నుంచి 200 మీన లవరకు జీతమువసూలు చేయవచ్చును. జర్మనీ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు తాము విన్న ఉపన్యాసాలకు ఇంతసొమ్ము చెల్లించవలెనని నియమమున్నది. ఈసొమ్ము విశ్వవిద్యాలయానికి పోను. ఉపన్యాసాలిచ్చిన ఉపాధ్యాయుని కిచ్చి

96