Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43

          నీవేడ నిలిచితయో
          బండోళ్ల గురువులయ్యా

3. బండెనక బళ్లదారి
బళ్లెళ్లే ముళ్లదారి
దారెంతో దూరమల్లె
బారమయెర రాదారి

          నీవేడ కునికెదవో
          బండోళ్ల గురువులయ్యా
          నీవేడ ఓరిగితయో
          బండోళ్ల గురువులయ్యా

4. నడిరేయి నిద్దరేయి
సడిలేను ఎడ్లగంట
సుక్కల్లో సెంద్రుడేడీ
సోలింది మిన్నేరు

          నీలేడ పలుకుదువో
          బండోళ్ల గురువులయా
          నీలేడ కులుకుదువో
          బండోళ్ల గురువులయా

5. దారెంట బళ్లొరసా
ఏరుదాటె ఒళ్లొరసా
ఊరేళ్లే బళ్లొరసా
పదహారు బళ్లొరసా