వస్తావంటెపిల్ల వరుసలో పాడాలి
హరికాంభోజిస్వరాలు - త్రిశ్రం
అతడు: ఓలోలె ఓలోలె పిల్లానీవు
గోంగూర కోయగలవ పిల్లానీవు
ఆమె: గోంగూరకోయలేను అయ్యా నేను
గోళ్ళన్ని కందుతాయి అయ్యానాకు
అతడు: ఓలోలె ఓలోలె పిల్లానీవు
ధాన్యమైన దంచకలవ పిల్లానీవు
ఆమె: ధాన్యమైన దంచలేను అయ్యానేను
ధాన్యమంటె దగ్గుస్తదయ్యా నాకు
అతడు: ఓలోలె ఓలోలె పిల్లానీవు
ఏకులైన వడకగలవ పిల్లానీవు
ఆమె: ఏకులైన వడకలేను అయ్యానేను
ఏకులంటె ఏడుపొస్తదయ్యానాకు
అతడు: ఓలోలె ఓలోలె పిల్లానీవు
ఎల్లైన ఎయ్యగలవ పిల్లానీవు
ఆమె: ఎల్లైన ఎయ్యలేను అయ్యానేను
ఎల్లంటె ఏటోను అయ్యానాకు
అతడు: ఓలోలె ఓలోలె పిల్లానీవు
చాపైన ఎయ్యగలవ పిల్లానీవు