పుట:JanapadaGayyaalu.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీకూ నీవారు లేరు

నఠభైరవిస్వరాలు - ఆదితాళం


సా , సా , సా | , రీ మ | పా పా ||

నీ కూ నీ | వా రు | లే రూ ||


మ ప మ ప ద ప మ ప | మ గ మ గ | రి స సా ||

నా - - కు - - నా - | - వా - రు | లే - రు ||


స రి గ రి రి గ మ ప | మ గ రి స | స రి గ రి ||

ఏ టి ఒ డ్డు నా - - - | - ఇ - ల్లు | క డ ద ము ||


రి ప సా , పా | , మ ప మ | గ రి స ని ||

ప ద రా చల్ | మో హ న | రం గా - ||

నీకు నాకూ జోడు కలిసెను గదరా చల్ మోహనరంగా

2. మారుమల్లీ తోటలోన
మంచినీళ్ళ బావికాడ
ఉంగరాలు మరచివస్తిని
గదరా చల్ మోహనరంగా ||

3. కంటీకి కాటుకెట్టీ
కడవా సంకానబెట్టీ
కంటినీరు కడవనింపితి
గదరా చల్ మోహనరంగా ||

4. గట్టుదాటి పుట్టదాటి
ఘనమైన అడవిదాటి