పుట:JanapadaGayyaalu.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాబావ వచ్చేడు

హరికాంభోజిస్వరాలు - ఝంపెతాళం

సా రి మ మ || మా మా మ || గ మా గ రి - రీ

మా బా - వ || వ చ్చే డు || ఒ యి సె ల్లె లా


నీ సా రి || రి గ రీ స || నీ సా స || సా ", ||

నే నె ల్లి || వ స్తా - ను || ఓయిసెల్లె || లా - ||


కొత్తసీరాలెన్నో ఒయిసెల్లెలా

కొబ్బారి బెల్లాము ఒయిసెల్లెలా ||

సీటి గుడ్డాలెన్నో ఒయిసెల్లెలా

పైటి పావడాలు ఒయి సెల్లెలా ||

పట్టనం నుంచీని ఒయి సెల్లెలా

పట్టుకొచ్చేడమ్మ ఒయి సెల్లెలా ||

మాబావ వచ్చేడు ఒయిసెల్లెలా

నేనెల్లి వస్తాను ఒయిసెల్లెలా ||

నన్ను మరవాకండి ఒయిసెల్లులా

నామాడ మరవాకు ఒయిసెల్లులా ||

అమ్మమాటయిను ఒయిసెల్లులా

అయ్యమాటాయిను ఒయిసెల్లులా ||


              సేకరణ - కాకినాడ - 1942