ఈ పుట ఆమోదించబడ్డది
ఒయిబావల్లాల వలె
శంకరాభరణం స్వరాలు - త్రిశ్రం
1)
- ఏవూరు ఏపల్లె తుమ్మెదా
- ఎక్కడికి ఎల్తావు తుమ్మెదా
- గులకల్ల పాడూగుమ్మడే
- గోదారీ పక్కని గుమ్మడే
- గులకల్లపాడూ తుమ్మెదా
- అత్తోరు ఊరా తుమ్మెదా
- పుట్టిల్లుమాదీ గుమ్మడే
- గులకల్లాపాడే గుమ్మడే
- పాడిపంటలు ఉందా తుమ్మెదా
- సంతానము ఎందరె తుమ్మెదా
- పాడిపంట లేదు గుమ్మడే
- సంతానము లేదు గుమ్మడే
- అత్తగారు ఉందా తుమ్మెదా
- ఆడబిడ్డలు ఉన్నారా తుమ్మెదా
- అత్తగారు పోరు గుమ్మడే
- ఆడబిడ్డలపోరు గుమ్మడే
- పడలేక నేనూ గుమ్మడే
- మాఊరు పోతున్నా గుమ్మడే