పుట:JanapadaGayyaalu.djvu/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పెద్దవోరు లేర తుమ్మెదా
కంతబుద్ది సెప్పడానకి తుమ్మెదా


బుద్దిసెప్పేవోళ్ళకి గుమ్మడే
అసలు బుర్రేలేదు గుమ్మడే
అత్తలేని యిల్లు గుమ్మడే
ఆరళ్ళు ఉండదు గుమ్మడే
ఆయిగా ఉంటాది గుమ్మడే


ఆరళ్ళు గలవలి నెల్లెల
అవతలకి పోతాన నెల్లెలా


ఆడపుట్టుక కన్న అప్పయ్యో
సెట్టైపుట్టుట మేలప్పయ్యో


పోరులు పడలేక సెల్లెలో
పుట్టింటికి పోతాన సెల్లెలా
అత్తంటికి ఎల్లనే సెల్లెలా


మాఅత్తగారితొ అప్పయ్యో
ఊఅంటే తప్పు అప్పయ్యా
ఆ అంటే తప్ఫు అప్పయ్యా
ఏదన్నాతప్పే అప్పయ్యా


ఆ వె సెల్లి పోయిందాక సెల్లెలో
ఆ అన్న తప్పదు సెల్లేలా
వచ్చీనదారీ సెల్లేలా
యంటనే పట్టే సెల్లేలా
ఏ వనుకోకమ్మ సెల్లెలా ||

సేకరణ-------కాకినాడ