పుట:JanapadaGayyaalu.djvu/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దంపుళ్ళ పాట

(కొడుకంటు పుట్టాడు వలె)

1)

ముగ్గురన్నలతోడ నే బుట్టినాను
నా నడుమూ
మువ్వంచు చీర గోరిందీ - ఆ ఊ - ఆ ఊ

2)

నలుగురన్నలతోటి నే బుట్టినాను
నా నడుమూ
నల్లంచు చీర గోరింది - ఆ ఉ - ఆ ఉ

3)

అయిదుగురన్నలతోటి నే బుట్టినాను
నా నడుమూ
అద్దాలరవిక గోరిందీ - ఆ ఊ - ఆ ఊ

4)

గోడమీద గుడ్డ గొలుసులగుడ్డ
ఓలమ్మా
ఇంతచక్కనిగుడ్డ ఎవరంపినారు

5)

మన్నేన ఉండేటి బావంపినాడు
ఓలమ్మా
మన్నెమూ పేరేమి బావపేరేమి
మన్నెము మూసారం
బావ మారయ్య