పుట:Jagattu-Jiivamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలాకాశవైచిత్రి

49

సెకెనుకి 186000 మైళ్ళ వేగంతో కాంతి పరుగిడుతూన్నట్లు తెలిసింది. ఆ వేగంతో ఒక సంవత్సరం ప్రయాణంచేసిన కాంతి సుమారు 6 లక్షల కోట్ల మైళ్ళదూరం పోతుంది. ఆకాశంలో పడి నక్షత్ర విషయమై ముచ్చటించినప్పుడు మానవ మానములు అక్కరకు రావు. మన కతి సమీపంగానున్న తార 25 లక్షల కోట్ల మైళ్ళు దూరంగానుంది. దురూహ్యంగానున్న అట్టి విపరీత దూరాలకు అనువైన మానమొకటి ఏర్పరిచేరు. ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణం చేయగల దూరాన్ని - 6 లక్షల కోట్ల మైళ్ళు - ఒక "కాంతి సంవత్సరం" (light year) అన్నారు. ఆ మానంమీద మన సమీపతమ తారదూరం 4¼ కాంతి సంవత్సరాలు. మృగవ్యాధుని (Orion) క్రిందనున్న మహోజ్జ్వల తార అగు సిరియసు (sirius) దూరం 8½ కాంతి వత్సరాలు. నక్షత్రాల దూరం కాంతి సంవత్సరాలలో చెప్పుకొన్నప్పుడుకూడ ఊహాతీతమైనప్పటికి ఆ విధానంలో వైపరీత్యం కనిపించదు.

మనకిప్పుడు కనిపిస్తూన్న నక్షత్రాలన్నీ వాటి వాటి యథాస్థానాలలో నున్నాయని చెప్పలేము. ప్రమాదవశాత్తు ఈ క్షణాన్ని సిరియసు భిన్నమై అంతరించినప్పటికి 8½ ఏండ్లవరకు తనస్థానంలో సిరియసు భద్రంగా నున్నట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఏమంటే సిరియసు భిన్నమయే పూర్వం దానినుండి బయలుదేరిన కాంతి 8½ ఏండ్లు ఆకాశయానం చేసినపిమ్మట మనకంట్లో పడుతుంది. కాబట్టి 8½ ఏండ్లవరకు మృగవ్యాధుని క్రింద దేదీప్యమానంగా సిరియసు ఉన్నట్లే మనం భావిస్తాము. అంటే, నేడు మనం చూసిన సిరియసు యొక్క కాంతి, ఆకారం, వర్ణం మొదలైనవి 8½ ఏండ్ల క్రిందటివి కాని, నేటివికావు. ఇట్లే వందలు, వేలు, లక్షలాదిగ కాంతి సంవత్స