50
జగత్తు - జీవము
రాల దూరంలోనున్న నక్షత్రాలు, నెబ్యులూలు, గెలాక్సీలు ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. అట్టివి క్రమంగా వందలు, వేలు, లక్షలాది సంవత్సరాల పూర్వపుచరిత్రనే మనకు నివేదిస్తున్నాయి కాని, వాటి వర్తమాన చరిత్ర మనమెరుగము. ఉదాహరణగా : ఏండ్రొమెడా (Andromeda) రాశిలో నున్న పెద్ద నెబ్యులాదూరం 800,000 కాంతి సంవత్సరాలు. ఇప్పుడాకాంతిని విశ్లేషించి ఆనెబ్యులా యొక్క చరిత్ర చెప్పగలిగినట్లయితే 8 లక్షల సంవత్సరాల క్రిందటి చరిత్రను కనుగొన్నామే కాని, అది నేడెట్లుంటుందో ఎరుగము. ఇప్పుడు మన కంట్లో పడుతూన్న కాంతి ఆ నెబ్యులానుండి బయలు దేరుసరికి భూమిలో మానవుడు జన్మించనేలేదు ! ఒకనాడు అకస్మాత్తుగా అ నెబ్యులా అంతర్ధానమైపోతే నాటికి 800,000 ఏండ్ల క్రితమే అది లయమైనట్లు భావించుకోవాలి. అగుట ఒక్కొక్క నక్షత్రాన్ని చూచినప్పుడు, భూతకాలంలో ఒక్కొక్క నిశ్చిత కాలభాగాన్ని విలోకిస్తున్నాము. ఇట్లు, 4¼ నుండి కొన్నికోట్ల సంవత్సరాలవరకు గడిచిన భూతకాలదృశ్య పరంపరను ఒకేసారి చూడగలుగుచున్నాము. ఇదే కాలప్రవాహానికి ఎదురీదడమేమో !
కాలమొక జీవనదీ ప్రవాహంగా భావింపబడుతూంది. సర్వజనామోదమైన నిత్య వ్యవహారంకొఱకు కాలాన్ని భూతభవిష్య ద్వర్తమానములను మూడు విభాగాలు చేసేరు. గతించినది భూతకాలము, జరుగుచున్నది వర్తమానము, రానున్నది భవిష్యత్తు. భూతకాల మనంతము ; భవిష్యత్కాలము అనంతమే. వర్తమానమెంత సూక్ష్మాతి సూక్ష్మమో ఊహించలేము. కనురెప్పపాటులో వర్తమానము భూతకాలభాగంలో చేరిపోతూంది. అనంత భవిష్యత్తు నుండి సూక్ష్మ కాలఖండాలను చెండి మానవ చై తన్యము భూత