పుట:Jagattu-Jiivamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

జగత్తు - జీవము

నేరదని విశ్వాసపూర్వకంగా ఎవరు చెప్పగలరు ? ఇతరగోళాలలో సమగ్ర చై తన్యము, ప్రసన్న భావ ప్రపత్తిగలవా ? ఐనచో, భూలోక శాసనమగు భావము వాటినుండి లాభమేల పొందకున్నది ? ఏకభావ జనితములగు భువనాల అన్యోన్య సంప్రతింపుల కవకాశమే లేదా ? మన ఏకాకిత్వంయొక్క మాయయేమి ? మన భూమియే ఉచ్చస్థితి వహించినదా ? ఇంతకన్న ముందంజవేయజాలకున్న జగద్భావము ఎట్టి తిమిరాన్ని పరిచ్ఛేదింప ప్రయత్నిస్తున్నది ? ఈతిమిర మాత్మోత్పన్నమా ? ఆనంత్యానికీ అభేద్యప్రశ్నలు ఎవరు వేసియున్నారు ? ఆదిని నక్షత్రాలలో ప్రారంభింపబడిన మహత్ప్రయోగాలు, తత్సంపాదిత బలపూర్వకంగాను, భూమిపై విత్తులట్లు ఆకాశంలో సూర్యులను విక్షేపించిన ప్రకృతి స్వభావానుగుణంగాను, భయానక ఫలితాలను గణించకయే యంత్రవత్ జరిగిపోతున్నావా ? అజ్ఞాన తిమిరావృతులమైయున్న మనము, సూక్ష్మదృష్టి సామర్థ్యమే లేని మనము, విశ్వమేధాశక్తి ప్రసాదించిన క్షుద్రభావలేశంతో నిరామయ విశ్వాన్ని సమీక్షించి, అసగ్రమని నిర్ణయించి, ఆత్మవంచకులమైపోతున్నామా ?

ఈ ప్రశ్నలకు సమాధానమెట్లీయగలము ? భావప్రపంచజనక మైన దానినే గ్రహింపలేని మనభావములు ఆనంత్యాన్ని ఎట్లుభేదించి అవగాహన చేసికొనగలవు ? దృష్టిప్రసాదకమైనదానినే చూడలేని మన దృక్కులు అగోచరాన్ని ఎట్లు భేదించగలవు ? యథార్థానికి మనం కాంతినే చూడలేము. అనంతగోళాలలో దేనిపైబడిన కాంతి పరావర్తనమొంది మనకంటజొచ్చునో ఆద్రవ్యాన్నే చూడగలము. లేదేని, అనేక ప్రచండభాను విక్షిప్తమై, అమిత శక్తిపూర్ణమైన ఆకాశము, అపరిమితజవంతో పరుగులెత్తి దిగ్వలయం వ్యాపించు తేజఃకిరణసమూహాలను గ్రసించి లయమొనర్చు అగాధ గాఢాంధ