పుట:Jagattu-Jiivamu.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
43
జీవితాంతము

చై తన్యం గోల్పోయి ఆనంత్యంతో మేళగింప నున్నను, నామరహితమై, ద్రవ్యరహితమై ఆత్మరహితమైన ఒక విశేషవస్తు ప్రాయంగా "అహం" కాలాకాశాతీతమైన అగాధంలో ముగినిపో నున్నను. ఈ ఆనంత్యంలో మనగతి యేమౌనని ప్రశ్నించుకొనుట నిరర్థకంగాదు. బహుజగద్భూయిష్టమైన విశ్వంయొక్క చరిత్ర నన్వేషిస్తున్నాము. విశ్వచరిత్రము మనచరిత్రమే !

ఆ ఆనంత్యంలో మనం దుఃఖిస్తామా ? ఈకళేబరమున్నంత వరకే మంచిచెడ్డలు, సుఖదుఃఖాలు అనుభవానికి వస్తవి. కళేబరం పోగానే, భౌతిక దుఃఖ సంపర్కమే నశిస్తుంది. అయినను మన ఆత్ర మాగదు. లోకంనుండి లోకానికి శరసన్నిభంగా పోవుచు, భువనాంతరాళాలలో అల్లల్లాడుచు, ఆత్మజ్ఞానం లేని దుర్‌జ్ఞేయంలో తన్ను తానెరుగని మనస్సు భౌతిక దుఃఖవాసనచే పరితపించునా ? అధవా, మనశ్శరీరాలు రెండును లయమైపోయినను వాటికి హేతు భూతమైన శక్తిద్రవ్యాలు రెండును ఏదో రూపంతో ఉండకతప్పదు. వాటిగతి మన గతియేకదా ! మరణానంతరమున జగత్తుయొక్క పరిణామమే మన పరిణామము. భౌతిక రూపంలో అవస్థానమొంద జాలమని "మనకేమి?" అనరాదు. ఆనంత్యంలోనే మనం అను నిత్యం మనుచున్నాము. సర్వము అందుండవలసినదే !

అనినంతనే ఒక ప్రశ్న పరంపర బయలుదేరుతుంది.

మరణానంతరం మనం ప్రవేశించు జగత్తు అధిక బాధాకరమైన క్రొత్తప్రయోగాలకు ఆటపట్టగునా ? ఐహికమే దుఃఖభాజన మైనప్పుడు పరంమాత్రమేల సౌఖ్యప్రదంకావలెను ? ఆనంత్యంలోని నిరంతర సంయోగాలు భౌతిక దుఃఖాలకన్న విషాన్వితంగా ఉండ