పుట:JATHA.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత 50




పంట పొలాలు
ప్లాట్లయి పోతున్నాయి
ప్లాటు ప్లేటులో
అన్నం పెడుతుందా?

భయం
అంతరంగ అగ్నిపర్వతం!
పుట్టిందా
విస్ఫోటనం తప్పదు!

గంగానదికి
పూజలు చేశాం!
మురికి కాల్వలు
దాంట్లోకె వదిలేశాం!

ఇంటర్నెట్‌ స్పీడు
పడిపోయింది!
వేల జీవజాతు
లంతరించిపోతున్నాయి!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/60&oldid=404232" నుండి వెలికితీశారు