పుట:JATHA.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51 నర్సింహారెడ్డి



అందరూ
బాధ్యత గల పౌరులే..
ఓటింగ్‌ శాతం
ఇరవై కూడా దాటలే!

స్మార్ట్ఫోన్
స్క్రీను పగిలింది!
గుండె పగిలినా
బావుండు అన్పించింది!

అంతర్జాలం
అందమైన మిథ్య
స్మార్ట్ఫోన్
దాని ప్రవేశ ద్వారం!

ప్రశ్నించటం
చిన్నప్పటి నుండే నేర్పాలి !
ప్రశ్న అవినీతికి
అడ్డుకట్ట

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/61&oldid=404224" నుండి వెలికితీశారు