పుట:JATHA.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

నర్సింహారెడ్డి




మనకొచ్చిన రోగము
మరొకని కది భోగము
చచ్చె ప్రజారోగ్యము
ఓ రాములమ్మ!


వచ్చినచొ ఎన్నికలు
రచ్చలో నాయకులు
కడు నిరాడంబరులు
ఓ రాములమ్మ!


అమలుకు సాధ్యమవని
హామీ పతంగులని
ఎగురవేయుట హాని
ఓ రాములమ్మ!


ఎండి పోయిన నేల
తుమ్ము జల్లుల వాన
రాష్ట్ర సమితి పాలన
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/27&oldid=404418" నుండి వెలికితీశారు