పుట:JATHA.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జత

16



కాలుతుందని నిప్పు
ముట్టుకొని మరిచెప్పు
వాడో సుద్దపప్పు
ఓ రాములమ్మ!


రాను రానని అనిన
కాదు రావాలనిన
మేలు కాలు విరిగిన
ఓ రాములమ్మ!


మందు తాగీ తాగి
మత్తు దిగువర కూగి
లేచి అముల్‌ బేబీ
ఓరాములమ్మ!


దేశి పదముల తోన
తేట తెలుంగు వీణ
పలికించెను సోమన
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/26&oldid=404416" నుండి వెలికితీశారు