పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

229



16. ఓ జననీ ! వజ్రతనువు, ప్రజ్వలించు తేజస్సుగల నీ వొక వీక్షణముచే శత్రువును తొలుత విగత తేజస్సుగలవానిగా జేసి, వాని ధైర్యమును నశింపఁ జేయగా, బిదప వానిపై సురపతి పరాక్రమమును చూపును.


17. ఇంద్రాణీ పాదపద్మములకంటె జగత్తులో మానవుల మననమున కుచితమైన దింకొకటి లేదు. రమణీయమైన ఆమె ముఖపద్మము కంటె దర్శనయోగ్యమైనది నరుల కింకొకటి లేదు.


18. మునులచే గానము చేయబడు చరిత్రగలది, స్వర్గ మధ్య పాతాళములను (స్వర్గమనెడి దివ్య తేజోలోకమును, ఆకాశమనెడి మధ్య మలోకమును, భూమిని) నిజబలముచే చలింప జేయునది, యింద్రుని దృక్కుల కమృతప్రాయమైనది యగు నింద్రాణి నాకు శరణము.


19. అతిశాంతరూపిణి, పుణ్యాత్ములకు హిత మొనర్చునది, తనయందు గల సంతత భక్తిచే మనస్సునందుండునది యైన ఇంద్రాణి నన్ను గతిగలవానిగా జేయుగాక.


20. ఓ జననీ ! నమ్రతతో గూడిన వినయముతో స్మరింపదగినది, కుల కుండాగ్ని నుండి ప్రసరించునది, ఋతశరీరములందు నూత్న వేగముతో వ్యాపించునదియైన నీ కళచే నేను రాత్రులను వెళ్ల బుచ్చెదను.


21. ఓ దేవీ ! (నీ వొక్క సారియైన) నాకు మంగళవాక్యము వేగముగా జెప్పుము.