పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

169



11. ఓ తల్లీ ! నీవు పంకాలను (వ్యజనములను) తిరుగునట్లు చేయు చుంటివి. ఆశ్చర్యము ! ఏ పండితుడు గొప్పవారి చరిత్రమును జెప్పగలడు ?


12. ఓ మాతా ! కొనియాడబడు బుద్ధిచే యంత్ర విశేషముల నెఱిగినవారు చేయు నద్భుతకార్య విశేషములన్నియు తటిత్తు వగు నీ కధీనము లేకదా !


13. ఓ దేవీ ! సంచరించలేని చెట్లు, పొదలు మొదలైనవి, సంచరించు సకల జంతుజాతముకూడ భువిలో తటిద్రూపిణివైన నీ బలము వల్లనే జీవించుచున్నవి.


14. ఓ తల్లీ ! నీ సహాయమువల్లనే సర్వమానవులు చింతించుట, కదలుట, పలుకుట, వినుట, చూచుట చేయుచున్నారు. మేము నీ యైశ్వర్యము నేమి వర్ణించగలము.


15. ఓ దేవీ ! అతి సూక్ష్మమైన పవిత్రమగు సుషు మ్నా నాడీ మార్గములో కులకుండాగ్ని శిఖవై, పవిత్ర దేహములందు నీవు ప్రకాశించుచుంటివి (తటిద్రూపముతో)


16. ఓ దేవీ ! కులకుండమును బొందిన యీఅగ్ని యింద్రునికంటె వేఱుకాదు, ఆ కులకుండాగ్ని శిఖ నీకంటె వేఱుగాదు.