పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

167



5. ఓ శచీ ! నీ తటిత్స్ఫురణ దృష్టిని హరించుచు, నీ గర్జన ధైర్యముతో గంభీరమైయున్నది. మెరుపురూపమున నున్న నీ భయం కరత్వము రామణీయముతో మిళితమైయున్నది.


6. ఓ దేవీ ! మేఘాధిపతియైన యింద్రుని మదింపజేయుదానవై, జనులకు దుఃఖమును గలిగించిన 'అవగ్రహ' మను పేరుగల రక్కసుని ఖండించి నీవు ప్రకాశించుచుంటివి.


7. మేఘాధిపతియగు నింద్రుని రమింపజేయుదానవు, నమస్కరించు వారి పాపములను హరించుదానవు, దిక్కుల తిమిరములను హరించుదానవు. అయి నీ వాకాశమందు విలసిల్లుచుంటివి.


8. అధిక గర్జనయు, ఉగ్రబలమును ధరించు తటిత్తు నా హృదయము నాక్రమించిన మాయ యనెడి తమః పటలమును శీఘ్రముగా నశింపజేయుగాక.


9. ఓ తల్లీ ! సమస్తాకాశమందు బ్రవహించు తటిద్రూప తరంగములలో నొకటియైన మెఱుపీ మేఘమందు బ్రకాశించుచున్నది.

(అవ్యక్తముగా నంతటను అలలుగా వ్యాపించియున్న విద్యుచ్ఛక్తియొక్క ఒకయలయే మనకుఘోరమైన మెఱుపగుచున్నది)


10. ఓ తల్లీ ! ధనికుల గృహములందు పటుయంత్ర బలమువలన బుట్టిన కిరణములుగల దీపములు (విద్యుద్దీపములు) నీ యొక్క లేశకాంతి యగుచున్నవి.