పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

165



25. గణపతియొక్క రమణీయమైన యీ 'మణిరాగ' వృత్తము లింద్రాణీ పాదములందర్పింపబడినవై ప్రకాశించుగాక.


__________


1. ఇంద్రుని మనస్సును మదింపజేయునది, శుభ్రతకు స్థానమైనది యగు ఆదిస్త్రీయొక్క ముఖమునుండి వెడలు మందహాసము నా యఖిల కలుషములను హరించుగాక.


2. బొత్తిగా ధనములేనిదై, యతిఖిన్ను రాలై, యిప్పుడు బహుళ రోదనము గావించుచున్న భరతక్షి తిని త్రిలోకపాలకురాలైన యింద్రాణి రక్షించుగాక.


3. ఓ తల్లీ ! మెరుపనెడి యుజ్జ్వలవేషముతో నీ వెచ్చట ప్రకాశింతువో, అట్టి మేఘసమూహము నీకు స్థలమైయున్నది.

(ఈస్తబకములోనివి మేఘవితానవృత్తములగుట చమత్కారము)


4. భూలోకమందు లలితమై, యువకచిత్తములను హరించు వనితలను బోలి మేఘమందు విలసించు తటిద్రూపముతోనున్న నీ భౌతికదేహము జయప్రదముగా ప్రకాశించుచున్నది.