పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

159



8. ఓ దేవీ ! నీ కటి పృథ్వీమండలమువలె నున్నది, నడు మాకాశమువలె నున్నది, నాభి పాతాళమువలె నున్నది.


9. ఓ తల్లీ ! ఏ నీ రోమరాజి దేవేంద్రుని ధైర్యమును గూడ హరించుచున్నదో, మన్మధునిశస్త్రమైన ఆ రోమరాజి నా పాపములను హరించుగాక.


10. ఓ దేవీ ! నీ రోమరాజి యనెడి పాముపిల్ల యింద్రహృదయమును కరచి, యతనితో చిరాయుర్జీవితముకొఱకు వాని హృదయమునకు మోహమును గలిగించుచున్నది. విచిత్రము !


11. ఓ జననీ ! జలపూర్ణములైన స్వర్ణఘటములవలెనుండి దేవేంద్రునిచే నుంచబడిన శక్తిని ధరించు నీ కుచములు విశ్వపోషణ కర్మయందు సమర్ధములై ప్రకాశించుచున్నవి.


12. ఓ తల్లీ ! స్వర్ణకుంభములనెడి స్తనములందు నీశక్తిపూర్ణమై యింద్రునితోగూడి లోకపానమందు (అతనికొఱకు) వీర్యమును భరించుచున్నవి.

(అనగా నామె కుచము లింద్రునకు పాలకశక్తినిచ్చుచు నితరులకు పోషణశక్తి నిచ్చు చున్నవని)


13. ఓ దేవీ ! అక్షయమగు నమృతపూర్ణఘటములనెడి కుచములను పానముజేసి జయంతుడు లోకములను బాధించిన భీకరరాక్షసులను సంహరించుటకు సమర్థుడయ్యెను.